Nara Lokesh: నారా లోకేశ్ పై వివిధ సెక్షన్ల కింద కేసుల నమోదు

Police files cases on Nara Lokesh under various sections
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర
  • సీఎం జగన్ ఫ్లెక్సీలను చింపించారంటూ లోకేశ్ పై వైసీపీ నేతల ఫిర్యాదు
  • లోకేశ్ తో పాటు యువగళం సభ్యులపైనా కేసులు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పై నల్లజర్ల పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల ఫిర్యాదుతో వివిధ  సెక్షన్ల కింద పోలీసులు లోకేశ్ పైనా, యువగళం సభ్యుల పైనా కేసులు నమోదు చేశారు. సీఎం జగన్ ఫ్లెక్సీలను లోకేశ్ చింపించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపైకి రెచ్చగొట్టి, ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. దాంతో పోలీసులు లోకేశ్, తదితరులపై సెక్షన్ 341, 506, ఆర్ డబ్ల్యూ 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.
Nara Lokesh
Cases
Police
Nallajarla
West Godavari District
Yuva Galam Padayatra

More Telugu News