Odisha: షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు!

12 killed as 61000 lightning strikes in 2 hours send shockwaves in odisha

  • ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన
  • పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు
  • మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాలు ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు. సెప్టెంబర్ 7 తరువాత వాతావరణం రాష్ట్రంలో సాధారణ స్థితికి వస్తుందని భారత వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ ఆ తరువాత కూడా పిడుగుపాట్లు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. 

ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కాగా, పిగుడుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సాహూ తెలిపారు.

  • Loading...

More Telugu News