Bharat: మన దేశం భారత్.. అప్పుడు, ఎప్పుడూ అదే పేరు ఉంటుంది: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

Country was and will always remain Bharat  Union Minister Rajeev Chandrasekhar amid controversy

  • రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుపై కాంగ్రెస్ విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలోనూ సమస్యలు కనిపిస్తాయన్న కేంద్రమంత్రి
  • నేను భారత్‌వాసిని, నా దేశం పేరు భారత్ అంటూ  రాజీవ్ చంద్రశేఖర్ చురకలు

జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని పేర్కొన‌డంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తి విష‌యంలో స‌మ‌స్య‌లు కనిపిస్తాయని విమర్శలు గుప్పించారు. దేశం ఇప్ప‌టికీ, ఎప్పటికీ భార‌త్‌గానే ఉంటుంద‌న్నారు.

కాంగ్రెస్ నేత‌ల‌కు తాను ఏమీ చెప్పదలుచుకోలేదన్నారు. తాను భార‌త్‌వాసిన‌ని, త‌న దేశం పేరు ఎప్ప‌టికీ భార‌త్‌గానే ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాల‌న్నారు.

సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జ‌రిగే ప్రత్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల్లో న‌రేంద్ర మోదీ ప్రభుత్వం పేరు మార్పు ప్ర‌తిపాద‌న‌ను స‌భ్యుల ముందు ఉంచనుందని భావిస్తున్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌గా మార్చే ప్ర‌క్రియ‌ను కేంద్రం చేప‌డుతుంద‌ని, ఈ పేరు మార్చుతూ స‌భ‌లో తీర్మానం ఆమోదించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News