Mahesh Babu: మొత్తం ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా: మహేశ్ బాబు

Mahesh is Looking forward to watching Jawan movie with the entire family
  • రేపు విడుదల కానున్న షారుక్ ఖాన్ జవాన్ చిత్రం
  • విలన్‌గా విజయ్ సేతుపతి, హీరోయిన్‌ పాత్రలో నయనతార
  • బ్లాక్ బస్టర్ అవ్వాలంటూ శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ 
వరుస పరాజయాల తర్వాత ‘పఠాన్’ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ముదులిపి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. ఆయన హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్’ గురువారం (ఈ నెల 7న) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సేతుపతి విలన్‌గా, నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దీపిక పడుకొణే, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ్, తెలుగులో భారీ అంచనాలున్నాయి. 

పలువురు సౌత్ స్టార్లు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడా చిత్రం విడుదల సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇప్పుడు జవాన్ సమయం వచ్చేసింది. షారుక్ ఖాన్ పవర్ మొత్తం వెండితెరపై కనబడబోతోంది. ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Mahesh Babu
Shahrukh Khan
Jawan
movie
Nayanthara
Bollywood

More Telugu News