Nayanthara: కవల పిల్లల ఫొటోలను పంచుకున్న విఘ్నేశ్, నయనతార

Nayanthara Vignesh Shivan share photo of sons Uyir Ulag 1st Janmashtami
  • కృష్ణుడి వేషధారణలో ఉలగ్, ఉయిర్
  • ముఖాలు కనిపించకుండా తీసిన ఫొటో
  • పిల్లలతో ఎంతో అందంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్నట్టు ప్రకటన
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు మొదటి సారి తమ కవల పిల్లల (ఉయిర్, ఉలగ్) ఫొటోను విడుదల చేశారు. వారు తమ పిల్లలతో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం ఇదే ప్రథమం. ఇద్దరు పిల్లలకు కృష్ణుడి అలంకారం చేసి, వెనుక నుంచి (ముఖాలు కనిపించకుండా) ఫొటో తీసి, దాన్ని విడుదల చేశారు. అక్టోబర్ తో ఉయిర్, ఉలగ్ లకు ఏడాది పూర్తవుతుంది. దేవుడి మందిరం వద్ద తమ పిల్లలను ఉంచి తీసిన ఫొటోను విఘ్నేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

‘‘మా ఇద్దరు కృష్ణులతో ఎంతో అందమైన కృష్ణ జయంతిని, ఆశీర్వచనాల మధ్య జరుపుకుంటున్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ తమ కుటుంబాలు, స్నేహితులతో పండుగ జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాం’’ అంటూ విఘ్నేశ్ శివన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మరోవైపు నయనతార బాలీవుడ్ ఎంట్రీ అయిన జవాన్ సినిమాకి మంచి స్పందన వస్తుండడం తెలిసిందే.
Nayanthara
Vignesh Shivan
share photo
twins
Uyir
Ulag
Janmashtami

More Telugu News