Kangana Ranaut: చంద్రముఖి 2: కంగనా రనౌత్‌ను ప్రశంసించిన నాటి చంద్రముఖి జ్యోతిక

Jyotika praises Kangana for Chandramukhi 2 calls one of the most talendted
  • చంద్రముఖి 2లో నటించిన కంగనా రనౌత్
  • సెప్టెంబర్ 15న విడుదల కానున్న సినిమా
  • కంగనపై ప్రశంసలు కురిపించిన జ్యోతిక
భారతీయ చలన చిత్ర పరిశ్రమ గొప్ప నటుల్లో ఒకరు కంగనా రనౌత్ అని, ఆమె చంద్రముఖి పాత్రను పోషించడం చాలా గర్వంగా ఉందని ప్రముఖ నటి జ్యోతిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. పద్దెనిమిదేళ్ల క్రితం 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాలో లక.. లక.. లక అంటూ జ్యోతిక అందర్నీ అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి-2 వస్తోంది. ఇందులో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా చంద్రముఖి-2 బృందానికి జ్యోతిక శుభాకాంక్షలు తెలుపుతూ, కంగనను ప్రశంసించారు. కంగనా గొప్ప నటి అని, ఆమె ఈ పాత్రను పోషించడం గర్వంగా ఉందన్నారు. చంద్రముఖి లుక్‌లో ఆమె అద్భుతంగా ఉన్నారని, ఆమె నటనకు తాను అభిమానిని అని చెప్పారు. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, రాఘవ లారెన్స్ మాస్టర్, పీ వాసు సర్ ఆల్ ది బెస్ట్.. మీకు విజయం దక్కాలని కోరుకుంటున్నానని పోస్ట్‌లో పేర్కొన్నారు.
Kangana Ranaut
jyothika
Bollywood

More Telugu News