Devendra Fadnavis: రాష్ట్రపతి ఇచ్చే విందుకు నేను హాజరు కావడం లేదు: దేవెగౌడ

I am not attending President of Indias dinner says Droupadi Murmu
  • జీ20 సమావేశాల నేపథ్యంలో రేపు రాష్ట్రపతి విందు
  • దేవెగౌడ, మన్మోహన్ లకు ఆహ్వానం
  • ఆరోగ్య సమస్యల కారణంగా హాజరు కాలేకపోతున్నానన్న దేవెగౌడ
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ లకు కూడా ఆహ్వానం అందింది. అయితే తాను విందుకు హాజరు కావడం లేదని దేవెగౌడ తెలిపారు. 

ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆయన స్పందిస్తూ... 'గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇస్తున్న జీ20 విందుకు నేను హాజరు కావడం లేదు. ఆరోగ్య సమస్యల కారణంగా నేను విందుకు వెళ్లడం లేదు. జీ20 సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. మరోవైపు ఈ విందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది.
Devendra Fadnavis
JDS
President Of India
Droupadi Murmu
Dinner

More Telugu News