Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత

Chandrababu Arrest APSRTC Buses Cancelled Statewide
  • ముందుజాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్న పోలీసులు
  • బస్సులన్నీ డిపోలకే పరిమితం
  • విశాఖలో ప్రయాణికులను దించి మరీ డిపోలకు తరలింపు
  • టికెట్ డబ్బులు వెనక్కి
  • సిటీ బస్సులు కూడా రోడ్డెక్కని వైనం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని బస్సులను నిలిపివేయగా, విజయవాడలో సిటీ బస్సులు కూడా రోడ్డుపైకి రాలేదు. 

పోలీసుల ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖపట్టణంలోని ద్వారక బస్‌స్టేషన్‌లో ప్రయాణికులను కిందికి దించి మరీ బస్సులను డిపోలకు తరలించారు. అప్పటికే టికెట్ తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు వెనక్కి ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు మాత్రం కాసేపు వేచి చూడాలని సూచించారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి కూడా బస్సులు బయటకు రాలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బస్సులను నిలిపివేశారు.
Chandrababu Arrest
APSRTC
Nandyal
Visakhapatnam
Vijayawada
Krishna District
Srikakulam District

More Telugu News