CPI Ramakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం: సీపీఐ రామకృష్ణ
- అర్ధరాత్రి పూట పోలీసులు హంగామా చేయాల్సిన అవసరం ఏముందన్న రామకృష్ణ
- ముందుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని వ్యాఖ్య
- లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. మరోవైపు చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.