Chandrababu: తెలంగాణలోనూ టీడీపీ నిరసనలు... ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మల దగ్ధం

TDP workers takes protests after Chandrababu arrest
  • చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం 
  • తెలంగాణలో పలు చోట్ల రాస్తారోకోలు
  • చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు. అటు, తెలంగాణలోనూ టీడీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మలను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. టీ-టీడీపీ కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, ఏపీలో పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
Chandrababu
Arrest
TDP
Telangana
Protests
Andhra Pradesh

More Telugu News