NRIs: చంద్రబాబు అరెస్టుపై లండన్ లో ఎన్ఆర్ఐల నిరసన

Protest Erupts in London as NRIs Condemn Arrest of TDP Chief Chandrababu
  • ఏపీ సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలో ప్లకార్డులతో ఆందోళన
  • అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదామంటూ నినాదాలు
  • ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోనూ ఎన్ఆర్ఐ టీడీపీ నిరసన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కు ఈ నిరసన సెగ తగిలింది. లండన్ లో ఆయన బస చేసిన ప్రాంతంలో ఎన్ఆర్ఐలు నిరసన ప్రదర్శన చేశారు.

అక్రమ అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదాం అంటూ నినాదాలు చేస్తూ పలువురు టీడీపీ అభిమానులు ఆందోళన చేశారు. ‘మంచోడు జైల్లో.. పిచ్చోడు లండన్ లో’ ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.  నెదర్లాండ్స్ తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
NRIs
Chandrababu
Arrest
Protest
London

More Telugu News