Nawajuddin Siddiqui: 'హడ్డి'గా నవాజుద్దీన్ సిద్ధికీ .. ట్రాన్స్ జెండర్ తీర్చుకునే ప్రతీకారమే కథ!

Haddi movie update

  • నవాజుద్దీన్ సిద్ధికీ ప్రధాన పాత్రగా 'హడ్డి'
  • ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్ 
  • ట్రాన్స్ జెండర్స్ నేపథ్యంలో నడిచే కథ
  • దర్శకుడిగా అక్షత్ అజయ్  


ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్స్ కి సంబంధించిన కథలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రను పోషించిన 'తాలి' వెబ్ సిరీస్ అంతా కూడా ట్రాన్స్ జెండర్స్ జీవితాలకు సంబంధించిన అంశాల చుట్టూ తిరుగుతుంది. అదే తరహాలో ఈసారి నవాజుద్దీన్ సిద్ధికీ ట్రాన్స్ జెండర్ పాత్రను పోషించిన 'హడ్డి' మూవీ .. ఈ నెల 7వ తేదీ నుంచి 'జీ 5' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. 

అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయానికి వస్తే, హడ్డి (నవాజుద్దీన్ సిద్ధికీ)కి స్త్రీగా మారాలనే కోరిక బలపడుతుంది. అందుకు సంబంధించిన సర్జరీ చేయించుకుని, స్త్రీగా మారతాడు .. తన పేరును 'హారిక'గా మార్చుకుంటాడు. రేవతితో కలిసి హారిక తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రమోద్ అనే గ్యాంగ్ స్టార్ రేవతిని హత్య చేస్తాడు. రేవతిని హత్య చేసిన ప్రమోద్ పై హారిక ఎలా ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది? అనేదే కథ. 

ట్రాన్స్ జెండర్స్ జీవితాలు .. వాళ్ల జీవితాల్లోకి తొంగిచూసే ప్రేమ .. పెళ్లి .. కొన్ని ఆరాచక శక్తుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పగలు .. ప్రతీకారాలు కామన్ అయినా, ఒక ట్రాన్స్ జెండర్ తన స్థాయికి మించిన వారితో తలపడటం కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమా, త్వరలో మిగతా భాషాల్లోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవాజుద్దీన్ నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు.

  • Loading...

More Telugu News