Anil Kumar Yadav: చంద్రబాబు, పురందేశ్వరిలపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు

Anil Kumar Yadav fires on Chandrababu and Purandeswari
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయేనన్న అనిల్
  • అక్రమ కేసు నమోదు చేశారని పురందేశ్వరి వ్యాఖ్యానించడం దారుణమని వ్యాఖ్య
  • చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజల్లో స్పందన లేదని ఎద్దేవా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముమ్మాటికీ ముద్దాయేనని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి మీద అక్రమ కేసు నమోదు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నిధులు మంజూరయ్యాయని, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నించారు. తనకు ఏమీ లేదని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ మరింత దిగజారిందని చెప్పారు. 

చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రజల్లో ఎలాంటి స్పందన రాలేదని... అందుకే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చి హంగామా చేస్తున్నారని అని విమర్శించారు. ఆదాయపన్ను అక్రమాలు, అమరావతిలో అవినీతి అంశాలు కూడా ఉన్నాయని, అవి కూడా బయటకు వస్తాయని చెప్పారు. అవినీతికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాతే అధికారులు కేసు నమోదు చేశారని అన్నారు. తప్పు చేసిన వారిపై కేసులు తప్పవని వైసీపీ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Anil Kumar Yadav
YSRCP
Chandrababu
Telugudesam
Daggubati Purandeswari
BJP

More Telugu News