US Open 2023: యుఎస్ ఓపెన్-2023 విజేతగా జకోవిచ్!

Novak djokovic wins us open 2023
  • రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌పై ఘన విజయం 
  • ఈ గెలుపుతో 24వ గ్రాండ్‌ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్
  • గతంలో 24 టైటిల్స్ గెలుపొందిన మార్గరెట్ కోర్టు రికార్డు సమం చేసిన వైనం 
సెర్బియా టెన్నిస్ లెజెండ్ నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ 2023 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌ను చిత్తుగా ఓడించి 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. దీంతో, టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24) రికార్డును సమం చేశాడు. 

2021 నాటి యుఎస్ ఓపెన్‌లో మెద్వెదెవ్ చేతిలో పరాజయం పాలైన జకోవిచ్ ఈసారి టోర్నమెంట్‌లో అతడిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. తొలి సెట్‌‌లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేశాడు. రెండో సెట్‌లో మెద్వెదెవ్‌ జకోవిచ్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో ఒకానొక దశలో స్కోరు 6-6కు చేరి ఉత్కంఠ రేపింది. ఈ దశలో జకోవిచ్ తన అద్భుత ఆటతీరుతో 7-6తో సెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాతి సెట్‌లోనూ జకోవిచ్ దూకుడు కనబరుస్తూ 6-3తో గెలుపొందాడు. ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గెలుపొందగా వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమి చవిచూశాడు.
US Open 2023
Novak djokovic
Medvedev

More Telugu News