Chandrababu: చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

CBI former director on Chandrababu remand report

  • విచారణాధికారి నివేదిక కాకమ్మ కబుర్లుగా ఉందన్న మాజీ డైరెక్టర్
  • నిరాధార ఆరోపణలతో తప్పుడు సమాచారంతో వాదనలు వినిపించారని వ్యాఖ్య
  • కేసుకు సంబంధంలేని ఉదాహరణలతో తప్పుగా అన్వయించారన్న నాగేశ్వరరావు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్‌, సీఐడీ రిమాండ్ రిపోర్టుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు స్పందించారు. సీఐడీ విచారణ అధికారి దాఖలు చేసిన నివేదిక మొత్తం కాకమ్మ కబుర్లుగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు సమాచారంతో చంద్రబాబుపై కోర్టులో వాదనలు వినిపించారన్నారు. కేసుకు సంబంధంలేని ఉదాహరణలతో గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులను కూడా తప్పుగా అన్వయించి చూపినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులను తప్పుగా ప్రస్తావించారన్నారు.

విచారణాధికారి కోర్టుకు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో వస్తోన్న రిమాండ్ రిపోర్టును తాను చదివానని పేర్కొన్నారు. దీని ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి నాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అందులో పేర్కొన్నారన్నారు. కాబట్టి పీసీ యాక్ట్ 17ఏ ప్రకారం నడుచుకోలేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న మిగతా విషయాలు అధికారుల పనితీరును దెబ్బతీస్తాయన్నారు. వీటిని కాకమ్మ కబుర్లుగా చెప్పవచ్చునన్నారు.

  • Loading...

More Telugu News