Chandrababu: చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్
- కస్టడీ పిటిషన్‌కు సంబంధించి రేపు కౌంటర్ దాఖలు చేస్తామన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- దీంతో కస్టడీ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం
- మరికాసేపట్లో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పు
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి కస్టడీని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఐదు రోజులు ఇవ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. తాము రేపు కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఏసీబీ న్యాయస్థానం... పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కోర్టు వెలువరించనుంది. హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు తర్వాతే.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. హౌస్ రిమాండ్ తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు పత్రాలు సిద్ధం చేశారు.