UK Couple: విమానం టాయిలెట్ లో ఓ జంట శృంగారం.. యూకేలో ఘటన

Couple Caught Having Sex Inside Toilet Of EasyJet Flight In UK Escorted Off Plane
  • ల్యాండయ్యాక వారిని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారని వెల్లడి
విమాన ప్రయాణంలో చాలామంది సినిమాలు చూస్తూనో, ఇయర్ ఫోన్ లో పాటలు వింటూనో గడిపేస్తుంటారు. ఇంకొంతమంది ఇలా ఫ్లైటెక్కగానే అలా నిద్రపోతారు. ఏ విమానంలోనైనా ఇది సాధారణంగా కనిపించే దృశ్యమే.. అయితే, లండన్ లో మాత్రం ఓ జంట ఏకంగా ఫ్లైట్ టాయిలెట్ లోనే శృంగారం చేశారు. ఒకే టాయిలెట్ లోకి ఇద్దరూ వెళ్లడం, ఎంతకీ బయటకు రాకపోవడంతో ఫ్లైట్ సిబ్బంది కల్పించుకున్నారు. డోర్ తీసి బయటకు రావాలని పిలిచినా స్పందించకపోవడంతో బయట నుంచి డోర్ ఓపెన్ చేశారు. లోపల కనిపించిన దృశ్యం చూసి ఫ్లైట్ సిబ్బందితో పాటు అక్కడికి దగ్గర్లో కూర్చున్న ప్రయాణికులు అవాక్కయ్యారు.

లోపల శృంగారం జరుపుతున్న యువకుడు వెంటనే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే, ఇదంతా ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్ లో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ నెల 8న లండన్ లోని లూటన్ సిటీ నుంచి లిబిజా ఐలాండ్ కు వెళుతున్న తమ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఈజీ జెట్ సంస్థ వెల్లడించింది. రెండున్నర గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఓ జంట అసభ్యంగా ప్రవర్తించిందని, లిబిజా ఐలాండ్ లో విమానం ల్యాండ్ అయ్యాక ఆ జంటను పోలీసులకు అప్పగించామని తెలిపింది. అయితే, ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారా? లేక హెచ్చరించి వదిలేశారా? అనే వివరాలను ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించలేదు.
UK Couple
EasyJet Flight
Sex Inside Toilet
London
luton

More Telugu News