NASA: భూమిని పోలిన మరో గ్రహంపై జీవం ఉనికి..? కీలక ఆధారం గుర్తించామన్న నాసా

Tentative Evidence of Life Found On Faraway Planet Says NASA
  • అంతరిక్షంలో 120 కాంతి సంవత్సరాల దూరంలో భారీ గ్రహం  
  • 2015లో గుర్తించిన ఈ గ్రహాన్ని ‘కే2-18 బి’ గా వ్యవహరిస్తున్న నాసా..
  • భూమి కంటే ఎనిమిది రెట్లు పెద్దదని వెల్లడి
  • భారీ సముద్రం ఆనవాళ్లు కనిపించాయన్న నాసా సైంటిస్టులు
అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాలను, వాటిపై జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు కీలకమైన విషయాన్ని గుర్తించినట్లు నాసా తాజాగా ప్రకటించింది. మన సౌర కుటుంబానికి ఆవల సుదూరంలో భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించామని, దానిపై సముద్రం ఆనవాళ్లు కనిపించాయని చెప్పింది. భూమితో పోలిస్తే ఈ గ్రహం దాదాపు 8.6 రెట్లు పెద్దగా ఉంటుందని తెలిపింది. ఈ కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కే2-18 బి గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమికి దాదాపు 120 కాంతి సంవత్సరాల దూరంలో, కే2-18 అనే శీతల మరుగుజ్జు నక్షత్రం కక్ష్యలో తిరుగుతోందని వివరించారు.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కే2-18 బి గ్రహాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికిని గుర్తించినట్లు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికి ఆధారంగా ఈ గ్రహం ఉపరితలం కింద మహా సముద్రం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, జీవం ఉన్నచోట మాత్రమే ఉత్పత్తయ్యే డిమెథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) ఆనవాళ్లను కూడా ఈ గ్రహంపై గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
NASA
Faraway Planet
Evidence of Life
K2-18 b
James Webb Telescope
carbon dioxide

More Telugu News