Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు... లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన రజనీకాంత్

Rajinikanth talks to Nara Lokesh over Chandrababu arrest
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత
  • లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడిన రజనీకాంత్
  • చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా రాజమండ్రి నుంచే అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ కు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. 

తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు అని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని ఈ సందర్భంగా రజనీకాంత్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నేత అని కొనియాడారు. ఈ తప్పుడు కేసులు... అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు.  

తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
Rajinikanth
Nara Lokesh
Chandrababu
Arrest
TDP
Andhra Pradesh
Tamil Nadu
Kollywood

More Telugu News