Stock Market: లాభాల్లో మగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 246 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 77 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎయిర్ టెల్, టైటాన్

నిన్న మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్ లో మధ్యాహ్నం వరకు సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించినప్పటికీ... ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 67,467కి పెరిగింది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 20,070కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.72%), టైటాన్ (2.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.82%), యాక్సిస్ బ్యాంక్ (1.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.39%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), ఎల్ అండ్ టీ (-1.18%), నెస్లే ఇండియా (-0.76%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.61%), టీసీఎస్ (-0.42%).

  • Loading...

More Telugu News