INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. కొందరు యాంకర్లు.. టీవీ షోల బాయ్‌కాట్

INDIA Bloc To Boycott Some Anchors and TV Shows
  • జాబితాను రూపొందించే పనిలో ఇండియా కోఆర్డినేషన్ కమిటీ మీడియా సబ్‌గ్రూప్
  • కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలోనే నిర్ణయం
  • రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను కొన్ని మీడియా సంస్థలు బాయ్‌కాట్ చేశాయని ఆగ్రహం
  • మే 2019లోనూ నెల రోజులపాటు మీడియాను బాయ్‌కాట్ చేసిన కాంగ్రెస్
విపక్ష ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. కొందరు టీవీ యాంకర్లను, షోలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకుంది. బాయ్‌కాట్ చేయబోయే యాంకర్లు, షోల జాబితాను విపక్ష నేతలు రెడీ చేయనున్నారు. మీడియాపై సబ్‌గ్రూప్ కమిటీ యాంకర్లు, షోల పేర్లను రూపొందిస్తుందని కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కొన్ని మీడియా సంస్థలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోలేదు. కనీస కవరేజీ కూడా ఇవ్వలేదు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా విస్మరించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ప్రధాన మీడియా ‘భారత్ జోడో యాత్ర’ను బాయకాట్ చేసిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.  మే 2019లోనూ కాంగ్రెస్ నెల రోజులపాటు టీవీ షోలను బాయ్‌కాట్ చేసింది.
INDIA Bloc
Congress
Boycott
TV Shows
Anchors

More Telugu News