Google: రిక్రూటర్లపై వేటు వేసిన గూగుల్ 

Google fires hundreds of recruiters in another round of layoffs
  • వందలాది మందిని తొలగిస్తున్నట్టు సమాచారం
  • కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదన్న గూగుల్
  • వ్యయాలు తగ్గించుకుని, లాభాలు పెంచుకునే చర్యలు
గూగుల్ మరో విడత ఉద్యోగులపై వేటు వేసింది. ఈ సారి రిక్రూటర్లపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి తొలగిస్తున్నట్టు వందలాది మంది రిక్రూటర్లకు బుధవారం గూగుల్ సమాచారం ఇచ్చింది. గూగుల్ రిక్రూటింగ్ గ్రూప్ లో ఒకానొక సమయంలో 3,000 మంది పనిచేస్తుండగా, తొలగింపులతో ఈ సైజు తగ్గుతూ వస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ తొలగింపులు ఇక ముందూ కొనసాగుతాయనే అనుమానాలు నెలకొన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు ఈ వరుస తొలగింపు చర్యలను చూస్తుంటే వ్యయ నియంత్రణ చర్యలను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. మానవ వనరులను మరింత పొదుపుగా వినియోగించే యోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.

‘‘మా రిక్రూటింగ్ టీమ్ సైజు తగ్గించేందుకు మేము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. గొప్ప ఇంజనీరింగ్, టెక్నికల్ నైపుణ్యాలపై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం. అదే సమయంలో అర్థవంతంగా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నాం’’ అని గూగుల్ అధికార ప్రతినిధి కర్టెనరీ మెన్సిని తెలిపారు. గూగుల్ గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగుల తొలగింపులు చేస్తోంది. తద్వారా వ్యయాలు తగ్గించుకుని, లాభాలను పెంచుకునే చర్యలు అనుసరిస్తోంది.
Google
fires
recruiters
layoffs

More Telugu News