Jayalalitha: ఆ సినిమాలు చేజారకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది: నటి జయలలిత

Jayalalitha Interview

  • అందాల నటిగా పేరు తెచ్చుకున్న జయలలిత 
  • చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నానని వెల్లడి
  • నాట్యమే తనని సినిమాల్లోకి తీసుకొచ్చిందని వ్యాఖ్య 
  • 'సప్తపది' తాను చేయవలసిన సినిమా అంటూ వివరణ 

జయలలిత .. అందం .. అభినయం తెలిసిన నటి. చాలా కాలం క్రితమే తెలుగు తెరకి పరిచయమైన ఆమె, తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించారు. వై విజయ తరువాత ఆ తరహా పాత్రల ద్వారా పాప్యులర్ అయ్యారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ .. నేర్చుకుంటూ వెళ్లాను. వెయ్యికిపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. గుంటూరు కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను .. అప్పటికే అందాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. నా నాట్య ప్రదర్శనలే నాకు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టాయి" అని అన్నారు. 

"నేను చేసిన మొదటి సినిమా 'ఈ పోరాటం మార్పు కోసం'. ఆ తరువాత 'సప్తపది' సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. అలాగే 'మయూరి' సినిమా కోసం కూడా ముందుగా నన్నే సంప్రదించారు. ఇక 'ఖైదీ' సినిమాలో సుమలత చేసిన పాత్రకిగాను ముందుగా నన్నే అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాలు చేజారిపోయాయి. లేకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News