Navdeep: తాను పరారీలో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై హీరో నవదీప్ స్పందన

Hero Navdeep reacts to news about he is at large
  • టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
  • మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు
  • నవదీప్ పారిపోయినట్టు మీడియాలో వార్తలు
  • తాను హైదరాబాదులోనే ఉన్నానన్న నవదీప్
  • పోలీసులు వేరే నవదీప్ గురించి చెప్పారేమో అని వెల్లడి
మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పై కేసు నమోదైందని, నవదీప్ పరారీలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని, అతడిచ్చిన సమాచారం ఆధారంగానే నవదీప్ డ్రగ్స్ వాడినట్టు తేలిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 

దీనిపై నవదీప్ స్పందించాడు. తాను కుటుంబంతో సహా పారిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాదులోనే ఉన్నానని తెలిపాడు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. ఒకవేళ పోలీసులు వేరే నవదీప్ గురించి ప్రెస్ మీట్లో చెప్పారేమో అని హీరో నవదీప్ వ్యాఖ్యానించాడు. పోలీసులు హీరో నవదీప్ అని చెప్పలేదు కదా అని పేర్కొన్నాడు.
Navdeep
Drugs
Police
Hyderabad
Tollywood

More Telugu News