lv subramaniam: చంద్రబాబు అరెస్ట్‌లో సీఐడీ తీరు రాజ్యాంగ విరుద్ధమన్న మాజీ సీఎస్
- టీడీపీ అధినేత అరెస్ట్‌పై స్పందించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం
- కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టే అధికారం దర్యాఫ్తు సంస్థలకు లేదని వ్యాఖ్య
- అమలు తీరులో తప్పులు ఉంటే మాత్రం సంబంధిత అధికారి బాధ్యుడవుతారని వెల్లడి
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. సీఐడీ దర్యాఫ్తు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రతిపాదనకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టే అధికారం దర్యాఫ్తు సంస్థలకు ఉండదన్నారు. అమలు తీరులో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం సంబంధిత అధికారి బాధ్యుడవుతారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నాలుగు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు. ఈ రోజు బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేశారు.