Actor Navdeep: నేనిక్కడే ఉన్నా.. ఎక్కడికీ పారిపోలేదు.. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ వివరణ

Im Here In Hyderabad Actor Navdeep Clarifies
  • డ్రగ్స్ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం 
  • నటుడు నవదీప్, సినీ నిర్మాత ఉప్పలపాటి రవి సహా పలువురు పరారీలో ఉన్నారన్న పోలీసులు
  • నిమిషాల్లోనే వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన నవదీప్
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ సహా పలువురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ప్రకటనపై నటుడు స్పందించాడు. తానెక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. డ్రగ్స్ కేసుకు తనకు సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియోను షేర్ చేశాడు. తానెక్కడికీ పారిపోవాల్సిన అవసరం లేదని, దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని కోరాడు. నవదీప్ పరారీలో ఉన్నాడన్న వార్తలు వచ్చిన నిమిషాల్లోనే అతడు స్పందించడం విశేషం. తానిక్కడే (హైదారబాద్) ఉంటానని, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని నవదీప్ వివరించాడు.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె. వెంకటరత్నం, మరో నిందితుడు కాప భాస్కర్ బాలాజీ ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నైజీరియన్లు సహా 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. సినీ నటుడు నవీదీప్, షాడో చిత్ర నిర్మాత ఉప్పలపాటి రవి, గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్ యజమాని సూర్య, బంజారాహిల్స్‌లోని బిస్త్రో, టెర్రా కేఫ్ యజమాని అర్జున్, విశాఖపట్టణానికి చెందిన కలహర్‌రెడ్డి సహా మరికొందరు పరారీలో ఉన్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నవదీప్ స్పందిస్తూ ఈ షార్ట్ వీడియోను విడుదల చేశాడు.
Actor Navdeep
Tollywood
Tollywood Drugs Case

More Telugu News