Sikh Teen Beaten Up: కెనడాలో సిక్కు కుర్రాడిపై దాడి.. పిడిగుద్దులు కురిపించి పెప్పర్ స్ప్రే చల్లిన యువకులు

Sikh teen beaten up in Canada
  • బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో ఘటన
  • కుర్రాడిని బస్సు ఎక్కకుండా అడ్డుకున్న ఇద్దరు యువకులు
  • ఆపై లైటర్‌తో బెదిరించి వీడియోగ్రఫీ
  • ఈ ఏడాది ఇది రెండో ఘటన
కెనడాలో ఓ బస్టాప్‌లో 17 ఏళ్ల సిక్కు కుర్రాడిపై దాడి జరిగింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో సోమవారం జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. బస్టాప్‌లో నిల్చున్న కుర్రాడితో వాగ్వివాదానికి దిగిన మరో కుర్రాడు ఆ తర్వాత అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. ఆపై పెప్పర్ స్ప్రే చల్లినట్టు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక న్యూస్ చానల్ పేర్కొంది. 
 
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతకుమించి వివరాలు వెల్లడించలేదు. అయితే కెనడాలోని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ మాత్రం స్టేట్‌మెంట్ విడుదల చేసింది. బస్టాప్‌ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తొలుత బాధిత కుర్రాడిని బస్సు ఎక్కకుండా అడ్డుకున్నారని, బస్సు ఎక్కిన తర్వాత అతడిని బెదిరింపులకు గురిచేశారని పేర్కొంది. 

లైటర్‌తో బెదిరించడమే కాకుండా తమ ఫోన్లతో ఆ ఘటనను రికార్డు చేశారని తెలిపింది. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని సంస్థ బ్రిటిష్ కొలంబియా ఉపాధ్యక్షుడు గుంటాస్ కౌర్ పేర్కొన్నారు. కాగా, సిక్కు యువతపై బహిరంగ ప్రదేశాల్లో దాడి జరగడం ఈ ఏడాది ఇక్కడ రెండోసారి. మార్చిలో 21 ఏళ్ల సిక్కు విద్యార్థి గగన్‌దీప్ సింగ్‌పై ఇదే ప్రావిన్స్‌లో దాడి జరిగింది.
Sikh Teen Beaten Up
Canada
British Colombia
Pepper Spray

More Telugu News