Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో ఐటీ ఉద్యోగుల భారీ నిరసన కార్యక్రమం

IT Employees huge protest in Bengaluru and extend their support for Chandrababu
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల నిరసనలు
  • ఇవాళ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఐటీ ఉద్యోగుల  నిరసన
  • వందల సంఖ్యలో హాజరైన ఐటీ ఉద్యోగులు
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. తాజాగా బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బాబుతో నేను అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం పడుతున్నా కానీ వారు తమ ప్రదర్శన కొనసాగించారు. బెంగళూరు నగరంలోని ఫ్రీడమ్ పార్కు పరిసరాలు ఐటీ ఉద్యోగుల నినాదాలతో మార్మోగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని... సైకో పోవాలి-సైకిల్ రావాలని ఐటీ ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అని ఎలుగెత్తారు.
Chandrababu
Arrest
IT Employees
Bengaluru
Protest
TDP

More Telugu News