army: కల్నల్ మన్‌ప్రీత్‌కు ఆరేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు నివాళి! అందర్నీ కదిలించిన వీడియో ఇదిగో!

6 Year Old Son Of Colonel Killed In Action Pays Last Respect
  • ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్
  • పంజాబ్‌లోని మొహాలిలోని స్వగ్రామం ముల్లన్‌పూర్‌కు మృతదేహం
  • సెల్యూట్ చేసి నివాళులర్పించిన కొడుకు, కూతురు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకానికి అసువులుబాసిన రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతికకాయాన్ని పంజాబ్‌లోని మొహాలి జిల్లా ముల్లన్‌పూర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. సైనికుల గౌరవవందనం సమయంలో మన్‌ప్రీత్ ఆరేళ్ల తనయుడు కూడా తండ్రికి సెల్యూట్ చేశాడు. అతని పక్కనే నిలబడి ఉన్న రెండేళ్ల చెల్లెలు కూడా అతనిని అనుకరించింది. ఇది అక్కడున్న వారందర్నీ కదిలించింది. యుద్ధ వీరుడికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ బుధవారం ఉగ్రవాదుల కాల్పుల్లో అసువులు బాశారు. బుధవారం లోయలోని కోకోరెనాగ్ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పోలీస్ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్ సహా ముగ్గురు మృతి చెందారు. మేజర్ ఆశిక్ దోంఛక్ భౌతికకాయాన్ని పానిపట్‌లోని అతని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అంతిమయాత్రలో అధికారులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.
army
jawan
Punjab

More Telugu News