diabetes: మధుమేహంతో ప్రవర్తనలో మార్పులు

Can diabetes cause behavioral changes Experts explain

  • బ్లడ్ షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం సవాలే
  • ఎక్కువైనా, తక్కువైనా దాని తాలూకూ దుష్ప్రభావాలు
  • సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలన్నది కూడా ఒత్తిడే

నేడు టైప్-2 మధుమేహం భారత సమాజంలో చాలా వేగంగా, కార్చిచ్చు మాదిరిగా విస్తరిస్తోంది. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టైప్ 2 మధుమేహం ప్రాబల్యం అన్ని రకాల ఆదాయ దేశాల్లో పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ప్రకటించింది. మన దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది. 

‘‘మధుమేహం అన్నది దీర్ఘకాలిక జీవక్రియల అసమతుల్యానికి సంబంధించిన సమస్య. ఇది ప్రవర్తనను, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బ్లడ్ షుగర్ లో హెచ్చు తగ్గులు ఎన్నో రకాల ప్రవర్తనాపరమైన మార్పులకు కారణం అవుతాయి‘‘ అని ఫరీదాబాద్ మెట్రో హాస్పిటల్ ఎండోక్రైనాలజీ, డయాబెటాలజీ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ తెలిపారు.  

‘‘మధుమేహానికి జీవితాంతం పాటు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోవాలి. చాలా మందిలో ఇది ఒత్తిడి కలిగిస్తుంది. ఎందుకంటే ఆహార పరంగా ఎన్నో నియంత్రణలు పాటించాల్సి వస్తుంది. వ్యాయామాలు చేయడం ద్వారా ఈ ఒత్తిడిని అధిగమించొచ్చు’’ అని గురుగ్రామ్ లోని మ్యాక్స్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసన్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ దంగ్ వివరించారు. 

సమయానికి టాబ్లెట్లు తీసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవడం, రోజువారీ కార్యకలాపాల నుంచి వచ్చే దుష్ప్రభావాలు కొందరి తీరులో మార్పులకు కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఒత్తిడితో కూడుకున్నదని, ఒత్తిడి, ఆందోళన, అసహనం రూపంలో ప్రవర్తనా పరమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. 

నియంత్రణలో లేని బ్లడ్ షుగర్ తో వ్యక్తి మూడ్ లో మార్పులు వస్తాయని, బావోద్వేగ నియంత్రణ కోల్పోతారని.. బ్లడ్ షుగర్ మరీ తక్కువ అయితే ఆందోళన, చిరాకు అనిపిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మధుమేమం వల్ల నిద్రలేమి, న్యూరోపతి తదితర సమస్యలు లేదా తరచూ మూత్ర విసర్జన.. ఇవన్నీ నిద్ర లేకుండా చేస్తాయని ఫలితంగా చిరాకు, స్వభావంలో మార్పులకు దారితీస్తాయని అంటున్నారు.

  • Loading...

More Telugu News