TDP: కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల నిరసనలు... ఫొటోలు ఇవిగో!

TDP cadre continues protests in state
  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • టీడీపీలో భగ్గుమంటున్న ఆగ్రహ జ్వాలలు
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సంతకాల కార్యక్రమం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా పార్టీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా దీక్షలు, సంతకాల కార్యక్రమం కొనసాగాయి. పలు చోట్ల ప్రజలు కాగడాలు చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. 

తెలుగుదేశం పార్టీ నేతలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుక్కపట్నం చౌడేశ్వరి అమ్మవారికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పొర్లు డండాలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన తెలుగు మహిళ నేతలు తలపై పొంగళ్లు పెట్టుకుని వెళ్లి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో, పేరాల శివాలయంలో, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని శివాలయంలోనూ పూజలు చేశారు.

అటు, టీడీపీ నాయకత్వం పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. బాబుతోనే నేను అనే సందేశంతో కూడిన పోస్టు కార్డులను రాజమండ్రి జైలుకు పంపాలని నేతలు పిలుపునిచ్చారు.

పలాస నియోజకవర్గంలో మహిళలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్దులు ర్యాలీ చేపట్టారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాగడాల ర్యాలీ చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, బొండా ఉమా, ఎన్.ఎండి ఫరూక్, రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాస్, బుద్దా నాగజగధీష్, జ్యోతుల నవీన్, రెడ్డి అనంతకుమారి, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, మల్లెల లింగారెడ్డి, బి.కె పార్థసారథి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెగుళ్ళ జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాలవీరంజనేయస్వామి, మాజీ మంత్రులు దేవినేని ఉమా, పరిటాల సునీత, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులు, రాష్ట్ర మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు పాల్గొన్నారు.

TDP
Protests
Chandrababu
Arrest
Andhra Pradesh

More Telugu News