Revanth Reddy: అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి

will implement Guarantees  within 30 days of coming to power says Revanth Reddy
  • 2004లో తెలంగాణ ఇస్తానన్న హామీని సోనియా నిలబెట్టుకున్నారన్న టీపీసీసీ అధ్యక్షుడు 
  • ఈ రోజు సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
  • ఆరు గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియా గాంధీ
ఈ రోజు తుక్కుగూడలో జరిగే సభలో సోనియా గాంధీ ప్రకటించే ఆరు గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో సీడబ్ల్యూసీ రెండో రోజు సమావేశాలు ముగిసిన తర్వాత సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలంతా నేరుగా బహిరంగ సభకు చేరుకుంటారు. కాంగ్రెస్ విజయభేరి సభకు రాష్ట్ర నాయకత్వం పది లక్షల మందిని తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ సభలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారు. 6 హామీల గ్యారంటీ కార్డు విడుదల చేయనున్నారు.
Revanth Reddy
TPCC President
Sonia Gandhi
Hyderabad
Guarantees
Congress
Telangana

More Telugu News