Asia Cup: నేడే ఆసియా కప్‌లో భారత్–లంక ఫైనల్​.. వాతావరణం ఎలా ఉందంటే?

 90 per cent chance of rain in the evening at Asia Cup final

  • మధ్యాహ్నం 3 గంటలకు మొదలవనున్న ఆట
  • సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు
  • రేపు రిజర్వ్ డే

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ చేరుకున్న భారత్, శ్రీలంక ఆఖరాటకు సిద్ధమయ్యాయి. ఈ రోజు కొలంబోలో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిచిన భారత్ ఎనిమిదో కప్పుపై కన్నేసింది. చివరగా 2018లో ఆసియా కప్ నెగ్గిన భారత్‌ ఈ ఐదేళ్ల కాలంలో మరే ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు. దాంతో ఈసారి ఎలాగైన ఆసియా కప్ నెగ్గి ప్రపంచ కప్ ముంగిట ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని ఆశిస్తోంది. 

మరోవైపు టోర్నీ చరిత్రలో ఎక్కువగా 13సార్లు ఫైనల్‌కు చేరిన శ్రీలంక గతేడాది టీ20 ఫార్మాట్‌లో విజేతగా నిలిచింది. ఈ జట్టు మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారత్‌ నుంచి అక్షర్‌, శ్రీలంక నుంచి తీక్షణ గాయం కారణంగా దూరమవుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ రోజు కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో 90 శాతం వర్ష సూచనతో ఆటకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఇబ్బంది వస్తే రిజర్వ్ డే (సోమవారం) ఉపయోగంలోకి వస్తుంది.

  • Loading...

More Telugu News