Prime Minister: ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమించే నేత మోదీ.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

Kangana Ranaut Akshay Kumar Hema Malini Sunny Deol wish most loved leader in the world PM Narendra Modi on birthday
  • నవభారత నిర్మాణ శిల్పి అంటూ కంగనా రనౌత్ ప్రశంసలు
  • రాముడిలా మీ పేరు చిరకాలం నిలిచిపోతుందంటూ ట్వీట్
  • మరిన్ని సంవత్సరాల పాటు దేశాన్ని నడిపించాలన్న అనుపమ్ ఖేర్
  • సన్నీ డియోల్, కాజోల్, సోనూసూద్ సైతం శుభాకాంక్షలతో ట్వీట్లు
ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా ఎందరో ప్రముఖులు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వీరిలో కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, కిర్రన్ ఖేర్, హేమమాలిని, సన్నీ డియోల్, అక్షయ్ కుమార్, కాజోల్, సోనూ సూద్ తదితరులు ఉన్నారు.

కంగనా రనౌత్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ‘‘ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించే నేత, కృషి పట్టుదల ద్వారా సాధికారత యొక్క ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ సాధారణ వ్యక్తి, నవభారత నిర్మాణ శిల్పికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు భారత ప్రజల ప్రధాన మంత్రి మాత్రమే కాదు. రాముడి మాదిరిగా మీ పేరు ఈ జాతి చైతన్యంలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దీర్ఘకాలం పాటు మీరు ఆరోగ్యంతో ఉండాలి నరేంద్ర మోదీ సర్’’అంటూ కంగనా తన భావాలను పోస్ట్ రూపంలో పెట్టారు. 

‘‘దేవుడు మీకు చిరాయువును, దీర్ఘ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇదే విధేయత, కృషితో ఈ దేశాన్ని మీరు చాలా సంవత్సరాల పాటు ముందుకు నడిపించాలి. తొమ్మిదేళ్ల పాలనలో మీరు దేశానికి చేసిన సేవల పట్ల ప్రపంచంలోని నలుమూలల ఉన్న భారతీయులు గర్వపడుతున్నారు. మీ జీవితం ఎంతో స్ఫూర్తి నీయం. ఓ సాధువుగా మిమ్మల్ని అభివర్ణించిన మా అమ్మ కూడా తన ప్రేమ పూర్వక దీవెనలు పంపిస్తోంది’’అంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
Prime Minister
Narendra Modi
birthday
wishes
Kangana Ranaut
Akshay Kumar
Sunny Deol
Sonu Sood

More Telugu News