women reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
- లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
- ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు
- వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరు మార్పుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందా? అనే ప్రశ్నలు
లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్‌ను నిర్ధారించే బిల్లుకు నేటి సాయంత్రం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా కేబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు మీడియాకు చెబుతారు. కానీ ఈ రోజు కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించకపోవడంతో... మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ బిల్లు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది
పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటారని ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు తొలుత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడం వంటి అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందా? తెలియాల్సి ఉంది.