Rajamouli: ఇండియన్ సినిమాపై బయోపిక్.. సమర్పకుడిగా రాజమౌళి

Rajmouli is a part of Biopic if Indian cinema

  • భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదలపై బయోపిక్
  • ఆరు భాషల్లో తెరకెక్కనున్న చిత్రం
  • కథ వినగానే భావోద్వేగానికి గురయ్యానన్న రాజమౌళి

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ఈరోజు అయన కీలమైన ప్రకటన చేశారు. ఇండియన్ సినిమాపై వస్తున్న బయోపిక్ కు ఆయన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇండియన్ సినిమా మూలం ఏమిటనే కథతో 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా తెరకెక్కబోతోంది. భారత సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే గురించి ఇందులో చూపబోతున్నారు. భారతీయ సినిమా పుట్టుక, ఎదుగుదల ఈ సినమాలో చూపించనున్నారు. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా... ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తాలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రాజమౌళి సమర్పణలో రానుంది. 

ఈ నేపథ్యంలో రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... కథ విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సాధారణంగా బయోపిక్ లను నిర్మించడమే చాలా కష్టమని... అలాంటిది భారతీయ సినిమాపై బయోపిక్ ను నిర్మించడమంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ చిత్ర యూనిట్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మరోవైపు ఆరు భాషల్లో ఈ చిత్రం రాబోతోంది.

  • Loading...

More Telugu News