Chandrababu: క్వాష్ పిటిషన్ విచారణకు లంచ్ బ్రేక్.. చంద్రబాబు తరపు వాదనలు పూర్తి
- ఏపీ హైకోర్టులో ఈరోజు కొనసాగుతున్న విచారణ
- చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
- సీఐడీ తరపున వాదించనున్న ముకుల్ రోహత్గీ
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు వాదనలను కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించారు. వీరి వాదనలను విన్న హైకోర్టు విచారణకు భోజన విరామాన్ని ప్రకటించింది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. విరామం అనంతరం సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ ఇరువురూ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు.