minimum age: సోషల్ మీడియా వినియోగానికి 18 ఏళ్ల వయోపరిమితిని పెట్టండి: కర్ణాటక హైకోర్ట్

Set minimum age to access social media says Karnataka high court

  • యువత వ్యసనపరులుగా మారుతున్నారన్న హైకోర్టు డివిజన్ బెంచ్
  • వారిని నియంత్రించడం దేశ ప్రయోజనాలకు మంచిదని వ్యాఖ్య
  • ఓటు హక్కుకు మాదిరే పరిమితి విధించాలన్న కోర్టు

కర్ణాటక హైకోర్టు సామాజిక మాధ్యమాల విషయంలో కీలక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. యువతను, ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదని వ్యాఖ్యానించింది. అసలు సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశానికి గాను కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలని పేర్కొంది. 

ట్విట్టర్ దాఖలు చేసిన ఓ వ్యాజ్యంపై కోర్టు విచారణ నిర్వహించింది. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు సోషల్ మీడియాకు వ్యసన పరులుగా మారుతున్నట్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో బుధవారం తన తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించింది. ట్విట్టర్ లో కంటెంట్ బ్లాక్ కు వీలుగా లోగడ సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆదేశాలను ట్విట్టర్ సవాలు చేయడంతో, దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

  • Loading...

More Telugu News