Women Bill: మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. ఏపీ, తెలంగాణలో మహిళలకు దక్కే సీట్లు ఎన్నంటే..!

If Reservation Bill Approved how many seats will women get in Andhra Pradesh And Telangana

  • పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
  • లోక్ సభలో బిల్లుపై కొనసాగుతున్న చర్చ
  • బిల్లు నేడు ఆమోదం పొందే అవకాశం!

దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ జరుగుతోంది. చర్చ పూర్తయ్యాక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. మహిళా రిజర్వేషన్లకు దాదాపుగా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుండడంతో సభలో ఈ బిల్లు పాస్ కావడం లాంఛనప్రాయమేనని రాజకీయ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు. 

చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా రూపకల్పన చేసిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రస్తుతం లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా మారాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో మహిళల ప్రాధాన్యం ఎంతమేరకు పెరగనుంది.. ఉభయ రాష్ట్రాల్లో మహిళలకు దక్కే అసెంబ్లీ స్థానాలు ఎన్ని..? లోక్ సభలో ఎన్ని సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయనే వివరాలు..

లోక్ సభలో..
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి.. ఇందులో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే.. 181 సీట్లు మహిళలవే. ఇందులో జనరల్ 138, ఎస్సీలకు 28, ఎస్టీలకు 15 సీట్లు దక్కనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో..
ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 8 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఇక అసెంబ్లీలోని 175 సీట్లలో 58 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. 

తెలంగాణలో..
రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో 5 నుంచి 6 సీట్లు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 40 సీట్లు మహిళలే దక్కించుకోనున్నారు.

  • Loading...

More Telugu News