Stock Market: కెనడా ఎఫెక్ట్.. ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 570 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 159 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- టెక్ మినహా అన్ని సూచీలకు నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 570 పాయింట్లు నష్టపోయి 66,230కి దిగజారింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 19,742కి పడిపోయింది. టెక్ సూచీ మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో పాటు, ఇండియా-కెనడా మధ్య సంబంధాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.
టెక్ మహీంద్రా (1.46%), ఏసియన్ పెయింట్స్ (0.83%), ఇన్ఫోసిస్ (0.80%), భారతి ఎయిర్ టెల్ (0.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.29%).
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.08%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.02%), కోటక్ బ్యాంక్ (-1.89%).