India: భారత కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కెనడా పెన్షన్ ఫండ్

Canada pension fund has invested over 2 billion in 9 Indian new age companies

  • బైజూస్, డైలీహంట్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు
  • దాదాపు అన్నింటా 1 శాతం నుంచి 6 శాతం మేర వాటాలు
  • కోటక్, ఐసీఐసీఐ, విప్రో, ఇన్ఫోసిస్ సంస్థల్లోను ఇన్వెస్ట్ చేసిన సీపీపీఐబీ

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్ - కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య దౌత్య, వ్యాపార సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కెనడా పెన్షన్ ఫండ్ భారత్‌లోని తొమ్మిది న్యూఏజ్ కంపెనీల్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB) మంచి రిటర్న్స్ కోసం వివిధ భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అకో, జొమాటో తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది.

ఏ కంపెనీలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టింది?

అకో కంపెనీలో రూ.292 కోట్ల పెట్టుబడి పెట్టగా, 3.6 శాతం వాటాను కలిగి ఉంది. బైజూస్‌లో రూ.1,456 కోట్లతో 3.4శాతం వాటాను, డెల్హీవెరీలో రూ.897 కోట్లతో 6.1 శాతం వాటాను, డైలీహంట్/వెర్సెలో రూ.207 కోట్లతో 6.2 శాతం వాటాను, ఎరుడిటస్‌లో రూ.7,633 కోట్లతో 4.3 శాతం వాటాను, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,663.50 కోట్లతో 4.3 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే జొమాటోలో 2.37 శాతం వాటా, నైకాలో 1.47 శాతం వాటా, పేటీఎంలో 1.76 శాతం వాటాలను కలిగి ఉంది. పై న్యూఏజ్ కంపెనీలతో పాటు భారత్‌కు చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్పోసిస్, విప్రో తదితర ప్రఖ్యాత కంపెనీల్లోను పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత కెనడా - భారత్ ఉద్రిక్తల నేపథ్యంలో CPPIB ఇన్వెస్ట్ చేసిన పలు కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి.

  • Loading...

More Telugu News