Ajit Pawar: మహారాష్ట్రలో మళ్లీ వేడెక్కిన రాజకీయం.. శరద్‌ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసిన అజిత్ పవార్ వర్గం

Ajit Pawar faction files disqualification petition against Sharad Faction MLAs
  • శరద్-అజిత్ పవార్ వర్గాలు పోటాపోటీ అనర్హత పిటిషన్లు
  • అజిత్ వర్గానికి మద్దతు పలుకుతున్న 41 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ వర్గం పిటిషన్
  • ప్రతిగా పిటిషన్ దాఖలు చేసిన అజిత్ వర్గం
  • కొందరు ఎమ్మెల్యేల పేర్లు మినహాయింపు
మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వర్గం-అజిత్ పవార్ వర్గం ఒకదానిపై మరొకటి అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. కొందరు ఎమ్మెల్యేలు ఇంకా శరద్ వర్గానికి మద్దతుగా నిలుస్తుండడంతో అజిత్ వర్గం ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

అజిత్ పవార్ క్యాంపునకు మద్దతు పలుకుతున్న 41 మంది ఎమ్మెల్యేలపై శదర్ పవార్ క్యాంప్ అనర్హత పిటిషన్ దాఖలు చేసిన వెంటనే అజిత్ వర్గం ఈ పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఈ పిటిషన్‌లో జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్, రోహిత్ పవార్, రాజేశ్ తోపె, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీర్‌సాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తన్‌పురే, రవీంద్ర భూసరా, బాలాసాహెబ్ పాటిల్ పేర్లను పేర్కొన్నారు. నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపూ పేర్లను మినహాయించారు.
Ajit Pawar
Sharad Pawar
Maharashtra
NCP

More Telugu News