Youtube: కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ మరో గుడ్ న్యూస్

Youtube launches youtube create app with generative ai features for content creators
  • వీడియో కంటెంట్ క్రియేషన్ కోసం ఉచిత ‘యూట్యూబ్ క్రియేట్’ యాప్
  • యాప్‌లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు
  • ప్రస్తుతం భారత్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న యాప్
  • వచ్చే ఏడాది యాపిల్ యూజర్లకూ యాప్ సిద్ధం
కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. వీడియో ఎడిటింగ్ మరింత సులువుగా మార్చేలా యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఉచిత యాప్‌లో షార్ట్, లాంగ్ వీడియోలకు ఏఐ సాయంతో అదనపు వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజీలు జోడించవచ్చు.

ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంది. ఇక టిక్‌టాక్ లాంటి బీట్-మ్యాచింగ్ టెక్నాలజీతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా క్రియేటర్స్ వాడుకోవచ్చు. వీడియో క్రియేషన్, షేరింగ్ సులువుగా, మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ యాప్ డిజైన్ చేసినట్టు యూట్యూబ్ పేర్కొంది. ప్రస్తుతం ఇది భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా పలు మార్కెట్లలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
Youtube
Content Creation
Video Editing

More Telugu News