M Nageswar Rao IPS: చంద్రబాబు అరెస్ట్ పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు మరో సంచలన ట్వీట్
- చంద్రబాబు అరెస్ట్ ను తొలి నుంచి కూడా తప్పుపడుతున్న నాగేశ్వరరావు
- సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారంటూ తాజా ట్వీట్
- అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా అని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు తొలి నుంచి కూడా చెపుతున్న సంగతి తెలిసిందే. సీఐడీ అధికారుల అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన పలు సందర్భాల్లో ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆయన తొలిరోజే చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా, దర్యాప్తు కూడా చేయకుండానే అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకపోతే అది అక్రమ నిర్బంధం అవుతుందని... అక్రమంగా నిర్బంధించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. అంతేకాదు, లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అనే సూచనలు కూడా ఇచ్చారు.
తాజాగా ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు. 'సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా' అని పరోక్షంగా ఏపీలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.