USA: నిజ్జర్ హత్యతో అమెరికా అప్రమత్తం.. జాగ్రత్తగా ఉండాలంటూ తమ దేశంలోని ఖలిస్థానీలకు సూచన?

FBI warned Khalistani elements in US after Nijjars killing in Canada

  • అమెరికా డిజిటల్ పత్రిక ‘ది ఇంటర్‌సెప్ట్’ సంచలన కథనం
  • హత్యాయత్నం జరగొచ్చంటూ తమ దేశంలోని ముగ్గురు ఖలిస్థానీలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ హెచ్చరించినట్టు వెల్లడి
  • ఎవరు ప్రాణహానీ తలపెడతారనేది మాత్రం చెప్పలేదన్న ‘ది ఇంటర్‌సెప్ట్’

కెనడాలో సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య తరువాత అమెరికా అప్రమత్తమైనట్టు అక్కడి డిజిటల్ వార్తాసంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. అమెరికాలోని ముగ్గురు సిక్కు వేర్పాటువాదులను జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ హెచ్చరించినట్టు పేర్కొంది. వారి ప్రాణానికి ముప్పు ఉన్నదంటూ ఎలర్ట్ చేసినట్టు పేర్కొంది.  

తనకు ప్రాణహాని ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించిందంటూ అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ కోఆర్డినేటర్ ప్రీత్‌పాల్ సింగ్ ది ఇంటర్‌సెప్ట్ పత్రికకు తెలిపారు. తనతో పాటూ మరో ఇద్దరికి ఇదే హెచ్చరికలు చేసినట్టు వెల్లడించారు. తమను జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎఫ్‌బీఐ నుంచి ఫోన్ కాల్స్ రావడమే కాకుండా కొందరు అధికారులు కూడా వచ్చి కలిసి వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు తమకు ప్రాణహాని తలపెడతారన్నది మాత్రం వెల్లడించలేదని తెలిపారు. 

ప్రీత్‌పాల్ చెప్పిన విషయాలను మిగతా ఇద్దరు వ్యక్తులు కూడా ధ్రువీకరించారు. ‘‘మాపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని గట్టిగా హెచ్చరించారు. కానీ, ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మాత్రం అస్సలు చెప్పలేదు. భారతీయ నిఘా వర్గాలు హానీ తలపెడతాయా? అన్న విషయాన్ని చెప్పలేదు. ప్రమాదం ఎక్కడి నుంచి రాబోతోందో గుర్తించగలిగేలా అదనపు సమాచారం ఇవ్వలేదు’’ అని వారిలో ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News