Sabarimala Devotees: తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు టోల్‌ఫ్రీ నంబర్.. ఫోన్ చేస్తే సమస్త వివరాలు!

TDB Launched Toll Free Number For Telugu Ayyappa Devotees
  • 1800-571-9984 నంబరును తీసుకొచ్చిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు
  • నిత్యపూజలు, సేవలు, వసతి, దర్శనం, అన్నదానం వంటి వివరాలను తెలుసుకునే అవకాశం
  • వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన టీడీబీ అధ్యక్షుడు
తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా 1800-571-9984  టోల్‌ఫ్రీ సదుపాయాన్ని తీసుకువచ్చింది. శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవాట్రస్ట్ ఆధ్వరంలో నిన్న కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీబీ అధ్యక్షుడు ఆనందగోపాలన్ ఈ నంబరును ప్రారంభించి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.

 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం వేలాదిమంది శబరిమల వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కె.విగ్నేశ్ మాట్లాడుతూ.. టోల్‌ఫ్రీ నంబరు ద్వారా శబరిమలలో జరిగే నిత్య పూజలు, సేవలు, వసతి, దర్శనం, అన్నదానం వంటి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
Sabarimala Devotees
Lord Ayyappa
Toll Free Number

More Telugu News