Asian games: ఆసియా క్రీడల్లో ఐదు పతకాలతో బోణీ చేసిన భారత్

Asian games India wins three silver and two bronze medals

  • రోయింగ్‌లో మూడు, షూటింగ్‌లో రెండు పతకాలు సొంతం
  • ఈ రోజు మొదలైన పతక పోటీలు  
  • నిన్న అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవం

చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేట మొదలు పెట్టారు. పతక పోటీలు మొదలైన రోజే అద్భుత ప్రదర్శన చేశారు. ఆదివారం జరిగిన  ఈవెంట్లలో ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు. రోయింగ్ లో మూడు, షూటింగ్‌లో రెండు పతకాలు నెగ్గారు. ఇందులో మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. మహిళల 10 మీటర్ల రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో మెహులీ ఘోశ్, రమిత, అషిచౌక్సితో కూడిన భారత జట్టు రజతం సాధించింది. 

ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో రమిత కాంస్య పతకం గెలిచింది. రోయింగ్‌ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్‌ లాల్–అర్వింద్ సింగ్ జోడీ వెండి పతకం నెగ్గింది. పురుషుల పెయిర్‌‌ పోటీలో బాబు లాల్‌ యాదవ్–లేఖ్ రామ్‌ జంట కాంస్యం గెలిచింది. పురుషుల వెయిట్ పోటీల్లో భారత జట్టు మరో రజతం సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News