Vijayasai Reddy: ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేసేవారికి ఆయన సంపాదనా రహస్యం తెలియదా?: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy lashes out at Nara Lokesh and Chandrababu
  • చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న
  • నలభై ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడని ఆరోపణ
  • 2014లో అధికారంలోకి రాగానే స్కిల్ స్కాంకు పాల్పడ్డాడన్న విజయసాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అగ్రనేతపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై ప్రశ్నలు కురిపించారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తవ్వినకొద్దీ అక్రమాలు బయటకు వస్తాయన్నారు.

'లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో...!' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News