Tollywood Drugs Case: డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్

Tollywood Drugs Case Cine Director Vasu Varma Arrested
  • ఈ నెల 5నే అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఆలస్యంగా వెలుగులోకి
  • జూన్ 19న సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అరెస్ట్
  • వారిచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
టాలీవుడ్‌ను ఇటీవల వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో సినీనటుడు నవదీప్‌ను కూడా అధికారులు విచారించారు. ఇదే కేసులో దర్శకుడు మంతెన వాసువర్మను ఈ నెల 5న మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 

సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పూణెకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ తెలోర్ ఇదే కేసులో జూన్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిద్దరిని జూన్ 19న అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో వాసువర్మ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఈ నెల 5న ఆయనను అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసే ముంబైకి చెందిన విక్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Tollywood Drugs Case
Director Vasu Varma
Navdeep
Writer Prithvi Krishna

More Telugu News