Kangana Ranaut: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న 'చంద్రముఖి 2' టీమ్!

Chandramukhi 2 Movie Update
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'చంద్రముఖి 2'
  • ఈ నెల 28వ తేదీన భారీస్థాయి రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
  • రిలీజ్ కి ముందు పెద్దమ్మతల్లి దర్శనం  
హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో 'పెద్దమ్మ టెంపుల్' ఒకటి. జూబిలీ హిల్స్ లోని ఈ ఆలయం ఎప్పుడు చూసినా భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అమ్మవారిని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక తమ సినిమా విడుదలకి ముందు అమ్మవారిని దర్శించుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

అలా 'చంద్రముఖి 2' సినిమా టీమ్ కూడా పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకి ముందుగా టీమ్ అమ్మవారి దర్శనం చేసుకుని, ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. దర్శకుడు పి.వాసు .. హీరో లారెన్స్ .. హీరోయిన్స్ కంగనా రనౌత్ - మహిమ నంబియార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా అక్కడ అభిమానుల సందడి కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.


Kangana Ranaut
Lawrence
Mahima
Chandramukhi 2

More Telugu News